Header Banner

గ్రామీణ అభివృద్ధికి భారీ నిధులు! ప్రతి పంచాయతీలో సీసీ రోడ్లు, విద్యుత్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్!

  Sat Feb 15, 2025 15:32        Politics

దేశంలోనే పరిశుభ్రతలో ఏపీ నెంబర్ వన్‌గా ఉండాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమని ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ‘‘స్వచ్చ ఆంధ్రా - స్వచ్చ దివాస్’’ నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ప్రతి నెలా మూడో శనివారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరగాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని అన్నారు. మన ఇళ్లు, ఇంటి పరిసరాలు, ఊరు పరిశుభ్రంగా ఉంటే దేశం శుభ్రంగా ఉంటుందని తెలిపారు. అధికారులు, కూటమి పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు కలిసి ప్రజలను జాగృతం చేయాలని సూచించారు. గతంలో ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు తీసిందని అన్నారు. గడిచిన ఐదేళ్లుగా అభివృద్ధి నిలిచిపోయిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.


ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!



బలహీనవర్గాల బాలికల గురుకుల పాఠశాలలను 60 మంది పిల్లలతో ప్రారంభించినట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గుర్తుచేశారు. ఎక్కడా లేని సౌకర్యాలు ఈ పాఠశాలల్లో కల్పించామని చెప్పారు. ప్రభుత్వం రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీని మంజూరు చేసిందన్నారు. రాష్ట్రంలో మంజూరైన రెండింటిలో ఒకటి ఆత్మకూరుకు వచ్చిందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆత్మకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రూ.29కోట్లు నిధులు మంజూరు చేశాయని ప్రకటించారు. ఆత్మకూరులో వంద‌పడకల ఆస్పత్రిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయడానికి మంత్రి సత్యకుమార్ అంగీకరించారని అన్నారు. రెండు జాతీయ రహదారులను కలిపే ఆత్మకూరు - సోమశిల రోడ్డు, నెల్లూరుపాళెం - వింజమూరు, సంగం - కలిగిరి రోడ్లని అభివృద్ధి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


రూ.25కోట్లతో ప్రతి పంచాయతీలో సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు. రూ.85కోట్లతో విద్యుత్తు సరఫరాకు అవసరమైన పనులు జరుగుతున్నాయని తెలిపారు‌. లిప్ట్ ఇరిగేషన్ సిస్టంలు పునర్నిర్మాణాలు జరుగుతాయని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి ఏపీలో రూ.10,50,000 కోట్ల అప్పులున్నాయని అన్నారు. జగన్ ప్రభుత్వంలో స్థానిక సంస్థల నిధులు రూ.1200కోట్ల మేర స్వాహా చేశారని విమర్శించారు‌. ఎంపీటీసీలు, సర్పంచులను కూడా మోసం చేశారని ఆరోపించారు. ఎన్ని లక్షల కోట్ల అప్పులున్నా, మెరుగైన పాలన సాగిస్తామని ఉద్ఘాటించారు. NREGS, 15th ఫైనాన్స్ నిధులను రాజకీయాలకు అతీతంగా పంచాయతీలకు ఇస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

టోల్ ప్లాజా కొత్త నిబంధనలు.. కారులో వెళ్తున్నారా.ఈ తప్పు చేస్తే డబుల్‌ టోల్‌ చెల్లించాల్సిందే.!

 

జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్‌ఐఆర్!

 

ఇలాంటి నీచుడిని ఏమి చేయాలితలపై కత్తితో పొడిచి.. నోట్లో యాసిడ్ పోసి.. ఆ తర్వాత అత్యాచారం - ఏపీలో షాకింగ్ సంఘటన!

 

వాలంటైన్స్ డే.. ముసలోడి ప్రేమ ముదిరిపోయిందిగా.. దివ్వెల‌.. దువ్వాడ.. ఈ ప్రేమ‌జంట‌ వీడియోపై ఓ లుక్కేయండి!

 

వైసీపీ నేతల్లో పెరిగిన టెన్షన్.. వంశీపై మరో రెండు కేసులకు రంగం సిద్ధం.. 88 మందిపై పోలీసులు కేసు నమోదు!

 

మోహన్ బాబు మరో ట్విస్ట్.. ఆ ఫిర్యాదు ఆధారంగా.. కుటుంబంలో కొంతకాలంగా గొడవలు!

 

ఏలూరులో ఉద్రిక్తత.. టీడీపీ-వైసీపీ నేతల మధ్య ఘర్షణ! కారణం ఏంటో తెలుసా..!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీ లాంటి మరో నాలుగు మృగాలను కూడా అరెస్ట్!

 

ప‌వ‌న్ నుంచి ఈ ల‌క్ష‌ణాన్ని తాను కూడా అల‌వాటు చేసుకోవాల‌న్న హీరోయిన్‌! సోషల్ మీడియా లో వైరల్!

 

శ్రీకాకుళం జిల్లాలో వైరస్ కలకలం! పదేళ్ల బాలుడి మృతి.. వైద్యుల నివేదికపై ఉత్కంఠ!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #village #development #budget #todaynews #flashnews #latestupdate